మరికొద్ది రోజుల్లో 2023కి గుడ్ బై చెప్పి.. 2024కు వెల్ కమ్ చెప్పబోతున్నాం. అసలు చాలా మందికి 2023 సంవత్సరం ఇప్పుడే మొదలయిందన్నట్లుగా ఉన్నప్పటికీ.. డిసెంబర్ నెల కూడా అయిపోవస్తోంది. మరో పన్నెండ్ రోజుల్లో 2023 ముగిసిపోనుంది. అయితే ప్రతిసారి లానే ఈసారి కూడా జనవరి 21 నుంచి కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల్లో బోలెడన్ని మార్పులు జరగనున్నాయి. అయితే ఈ మార్పుల వల్ల ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే.. ముందుగానే ఈ పనులు పూర్తి చేయడం మంచింది.
కొందరు భద్రతాకారణాల దృష్ట్యా బ్యాంక్ లాకర్లను ఉపయోగిస్తుంటారు. అయితే బ్యాంకు లాకర్లు వినియోగించేవారు కచ్చితంగా ఈ నెల 31 లోపు ఈ పని చేయాల్సి ఉంది. బ్యాంక్‌తో తాము చేసుకున్న అగ్రిమెంట్‌ను 31 డిసెంబర్ 2023లోపు నిబంధనలకు అనుగుణంగా ఒప్పుకుంటున్నట్లు సంతకం చేయాలి. ఒకవేళ ఈ పని చేయకపోతే జనవరి నుంచి బ్యాంక్ లాకర్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ప్రస్తుతం ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఉచితంగా చేసుకునేందుకు వీలు ఉంది. కానీ డిసెంబర్ 31 తర్వాత ఆధార్‌లో ఛేంజెస్ చేసుకోవాలంటే రూ. 50 చెల్లించాల్సిందే. అందుకే ఎవరైనా ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే డిసెంబర్ 31లోగా చేసుకోవడం మంచిది.
ఇక ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బయట పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుందో తెలియక.. చాలా మంది స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఖచ్చితంగా డిమ్యాట్ అకౌంట్‌ను వినియోగిస్తుంటారు. ఇలా డీమ్యాట్ అకౌంట్ వినియోగించేవారు డిసెంబర్ 31లోగా తమ అకౌంట్‌కు నామిని ఎవరన్న వివరాల్ని అందించాల్సి ఉంటుంది. ఒకవేళ నామిని వివరాల్ని ఇవ్వకపోతే.. కొత్త సంవత్సరం నుంచి తమ స్టాక్స్‌ను అమ్మేందుకు.. కొత్త స్టాక్స్‌ను కొనేందుకు వీలు ఉండదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY