డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత రోజుకో నిర్ణయంతో అందరినీ బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా ప్రపంచ దేశాలన్నింటిపైనా ప్రతీకార సుంకాలు విధించారు. కొన్ని దేశాలపై ఎక్కువ సుంకాలు, మరి కొన్ని దేశాలపై తక్కువ ఉన్నాయి. ఈ సంకాల ప్రభావం వల్ల ప్రపంచ దేశాలతో పాటు చివరకు అమెరికాకు కూడా నష్టాలు కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ పెంచిన సుంకాలు ఏప్రిల్ 2 అర్ధరాత్రి నుంచి అమలులోకి రావడంతో ప్రపంచ దేశాల అర్థిక వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. చివరకు స్టాక్ మార్కెట్‌లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. చివరకు అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై అగ్రరాజ్యం అమెరికాపై వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఏప్రిల్ 5 న హ్యాండ్ ఆఫ్ పేరుతో 50 రాష్ట్రాల్లో నిరసన తెలిపారు. ఇదే సమయంలో ట్రంప్ చేస్తున్న పనులు.. అటు అమెరికన్ వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయంటూ చైనాకు చెందిన సీజీటీఎన్ వార్తా సంస్థ సెటైరికల్‌గా ఓ వీడియోను క్రియేట్ చేసింది. 2 నిమిషాల 45 సెకన్ల డ్యూరేషన్ ఉన్న ఈ వీడియోలో, ట్రంప్ పాలనలో ప్రకటించిన ’లిబరేషన్ డే’ అనేది అమెరికన్ల శాలరీలను కూడా తగ్గించి, ఖర్చులను పెంచే రోజుగా చెబుతూ వీడియో క్రియేట్ చేసింది.
అల్పాదాయ కుటుంబాలపై ట్రంప్ పెంచిన సుంకాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని..స్టాక్ మార్కెట్లు ఇప్పటికే దెబ్బతిన్నాయని ఈ వీడియోలో చెప్పింది. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, ఆటోమొబైల్ ప్రొడెక్ట్స్ ధరలు ఆకాశాన్నంటడంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. ఇదే సమయంలో, మరో మీడియా సంస్థ రిలీజ్ చేసిన వీడియోలో ఈ సుంకాలను ఒక ఏఐ రోబో ’టారిఫ్’గా పేర్కొంది. వాణిజ్య యుద్ధం, ఆర్థిక అశాంతికి దారితీసే ఈ అధిక సుంకాలను తట్టుకోలేక, ఆ రోబో తనను తాను నిర్వీర్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వ్యంగ్యంగా చూపించింది.
For many Americans, "Liberation Day," hailed by Trump's administration, means shrinking paychecks and rising costs. Tariffs hit, wallets quit: low-income families take the hardest blow. As the market holds its breath, the toll is already undeniable. #LiberationDay #CGTNOpinion pic.twitter.com/RzXFFVHoFg
— CGTN (@CGTNOfficial) April 3, 2025