కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్‌, పోలీసులకు ఫిర్యాదు

Karnataka Congress Files Complaint Against Union Home Minister Amit Shah For Provocative Statements,Karnataka Congress Files Complaint,Complaint Against Union Home Minister,Complaint Against Amit Shah,Home Minister Amit Shah For Provocative Statements,Complaint Against Amit Shah For Provocative Statements,Mango News,Mango News Telugu,Karnataka Congress Files Complaint,Karnataka Polls 2023,Congress's Police Complaint,Shah riot remarks,Karnataka CM Bommai Reacts,Congress alleges Amit Shah of promoting,Karnataka Congress Complaint Latest News,Karnataka Congress Complaint Latest Updates

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెప్పడంతో పాటు ప్రత్యర్థి పార్టీల పాలనలోని లోపాలపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాట‌ల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒక్కోసారి నేతలు చేసే విమర్శలు, ఆరోపణలు శృతి మించుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేసిన కొన్ని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్‌ షా.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు జరుగుతాయి అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. దీంతో అమిత్‌ షా వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆయనపై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు జాతీయ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణదీప్‌ సుర్జేవాలా నేతృత్వంలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, డా.పరమేశ్వర్‌ తదితరులు బెంగళూరులోని హైగ్రౌండ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఇక అమిత్‌ షా ఎన్నికల ప్రచారంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్నారని, ప్రతిపక్షాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా మంగళవారం బాగాల్‌కోట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కుటుంబ రాజకీయాలు మళ్ళీ తెరమీదకు వస్తాయి, ఇవి తారాస్థాయికి చేరుకుంటాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకుంటాయి. కాంగ్రెస్‌ పార్టీకి పొరపాటున ఓటు వేస్తే రాష్ట్రంలో అవినీతి మునుపెన్నడూ చూడని స్థాయికి చేరుకుంటుంది’ అంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాగా, కర్ణాటకలో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుండగా.. షెడ్యూల్‌ ప్రకారం మొత్తం అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మే 10న పోలింగ్ జరగనుండగా అదే నెల 13న ఓట్లు లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో అధికారం కైవసం చేసుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 113 కాగా.. ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − one =