కరోనా కొత్త వేరియంట్‌‌పై శాస్త్రవేత్తల షాకింగ్‌ న్యూస్

Corona Now Attacks The Digestive System, Corona Now Attacks, Corona Attacks, Digestive System Attacks, Covid New Variant,Covid,Corona Attacks The Digestive System,Scientists, New Variant Of Corona, Corona, Latest Corona News, Latest Corona Updates, Latest Healh News, Health Tips, Mango News, Mango News Telugu
Covid New Variant,Covid ,Corona attacks the digestive system,scientists, new variant of Corona

2019 చివరిలో వచ్చిన కరోనా మహమ్మారి 2020లో.. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసింది. దీనితో పోరాడటానికి, ప్రపంచం మొత్తం కలిసి అనేక వ్యాక్సిన్‌లను తయారు చేసింది. వ్యాక్సిన్ వల్ల,  ప్రజలలో వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల..తీసుకున్న జాగ్రత్తల వల్ల  కరోనా కేసులు తగ్గి. 2023 నాటికి, ఈ  వైరస్ పూర్తిగా దూరమయిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అదే  చైనా నుంచి కరోనా కొత్త వేరియంట్ జేఎన్1 అనే మరొక వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందింది. డాక్టర్లు, అధికారులు అలర్ట్ అయ్యేలోగా ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయి.

చాలా దేశాల్లో  జేఎన్1  కేసులు భారీగా నమోదవుతుండడంతో పాటు.. భారత్‌లో కూడా రోజురోజుకు కొత్త వేరియంట్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రారంభంలో దీనిని న్యుమోనియా కొత్త రూపంగా వర్ణించారు. కానీ రోజురోజుకు కరోనా కొత్త వేరియంట్ చాలా భయంకరంగా మారుతోంది. దీంతో ప్రజలంతా మళ్లీ పాత రోజులను గుర్తు తెచ్చుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేఎన్1 వేరియంట్ పట్ల అప్రమత్తమయ్యాయి. దీనిపై ప్రజలకు కొన్ని  మార్గదర్శకాలను విడుదల చేసింది. మొన్నటి వరకు దేశంలో సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. గడిచిన వారం రోజులుగా కేసులు పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటకలో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. అటు అమెరికా, చైనా, సింగపూర్ దేశాల్లో కూడా జేఎన్1 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఒకవిధంగా చెప్పాలంటే ఆసుపత్రుల పరిస్థితి 2019, 2020లో ఎలా ఉందో అలాగే మారుతోన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ పై భయపడాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతున్నప్పటికీ.. మరోసారి ప్రపంచం మొత్తం జెన్ 1 గురించి ఆందోళన పడుతోంది. ఎందుకంటే తాజాగా కరోనాకు సంబంధించి నిపుణులు చెబుతున్న కొన్ని నిజాలు  షాకింగ్‌గా ఉన్నాయి. కొత్త కేసుకు సంబంధించి బయటకు వచ్చిన డేటా ప్రకారం.. జలుబు, దగ్గుకు బదులుగా కరోనా ఇప్పుడు ప్రజలపై ​​దాడి చేస్తుందని గుర్తించారు.

గతంలో కరోనా వైరస్ ఈ కొత్త వేరియంట్‌ గుర్తింపుపై రకరకాల వాదనలు వినిపించినా.. ఈ సారి మాత్రం కొత్త కరోనా జాతి ప్రజల ఇళ్ల నుంచి బయటకు వస్తున్న మురుగునీటిలోనే గుర్తించినట్లు తెలుస్తోంది. ఐరోపాలోని వ్యర్థ జలాల్లోనే కరోనాకు చెందిన కొన్ని కొత్త వైవిధ్యాలు కనుగొన్నట్లు చెప్పారు. అంతేకాదు ఇది గతంలో లాగా శ్వాసకోశ వ్యవస్థపై కాకుండా ప్రజల జీర్ణవ్యవస్థపైన దాడి చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

మొట్టమొదటిగా  దీనిని  ఐరోపాలో ధృవీకరించినా కూడా ..ఇతర దేశాల్లోనూ పెరుగుతున్న కరోనా కేసులను చూసి.. మిగిలిన దేశాలపై కూడా అక్కడి శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి సారించారు.  కరోనా బారిన పడిన ప్రజల జీర్ణ ఎంజైమ్‌లను పరీక్షించడానికి సిద్ధం అవుతున్నారు. ఏది ఏమయినా పెరుగుతున్న కేసులతో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తలు పాటిస్తే మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =