ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు ?

PLS TAKE NOTE OF THIS PTI PICK OF THE DAY::: Ahmedabad: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and LoP in Lok Sabha Rahul Gandhi during the All India Congress Committee (AICC) session at the Sabarmati Riverfront Event Centre, in Ahmedabad, Wednesday, April 9, 2025. (PTI Photo) (PTI04_09_2025_000181A)(PTI04_09_2025_000334A) *** Local Caption ***

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఏప్రిల్ 15న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ,కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ..ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో గాంధీ కుటుంబంపై తొలి ఛార్జ్‌షీట్ దాఖలైనట్లు అయింది. సుమన్ దూబే, ఇతరుల పేర్లను కూడా ఈ ఛార్జ్ షీట్‌లో చేర్చారు. ఈడీ ఫిర్యాదుపై ఏప్రిల్ 25న రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది.

ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు జారీ చేయడమే కాకుండా.. ఈ కేసులో ఈడీ ఇప్పటికే రూ.64 కోట్లకు పైగా ఆస్తులను కూడా జప్తు చేసింది. అలాగే రాహుల్, సోనియా గాంధీ, ఇతరులపై PMLA సెక్షన్ 44 , సెక్షన్ 45 కింద ఈడీ ఫిర్యాదు చేసింది. నిందితులు సెక్షన్ 3 కింద మనీలాండరింగ్ నేరానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. విచారణకు ముందు ఫిర్యాదు సంబంధిత పత్రాల క్లీన్ కాపీతో పాటు OCR కాపీని కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం, ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులోని ACJM-03 కోర్టులో విచారణలో ఉంది. మనీలాండరింగ్, నేరాలకు సంబంధించిన కేసు అయితే, 2 కేసులను ఒకే కోర్టులో విచారించాలి కనుక ఈ కోర్టులోనే కేసు విచారణ జరుగుతోంది. అలాగే ప్రతిపాదిత నిందితులు రాజ్యసభ, లోక్‌సభ సిట్టింగ్ ఎంపీలు కాబట్టి,ఈ కేసును ఈ కోర్టుకు అప్పగించారు. రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరికొందరిపై చార్జిషీట్ దాఖలు చేయడం పీఎం మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రతీకార, బెదిరింపు రాజకీయాలకు ఒక ఉదాహరణ అని ఆరోపించారు.

అయితే చాలామందికి నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు అంటే ఏంటి? ఎందుకు ఇప్పుడు మళ్లీ దీని పేరు వినిపిస్తుందని అనుకుంటున్నారు. కాగా నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు అనేది ఇండియన్ లిమిటెడ్,AJL అంటే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ , నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక మధ్య లావాదేవీలకు సంబంధించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలతో పాటు..AJL ఆస్తులను వారి ప్రైవేట్ నియంత్రణలో ఉన్న కంపెనీ ‘యంగ్ ఇండియన్’కు బదిలీ చేశారని ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నిధులను తమతమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టవిరుద్ధంగా ఉపయోగించారంటూ ఈడీ ఆరోపించింది.

నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రిక నుంచి నిధులు బదిలీ చేశారన్న ఆరోపణలున్న యంగ్ ఇండియన్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు 76 శాతం వాటా ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. 1938లో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను భారత దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అలాగే మరికొంతమంది స్వాతంత్ర్య సమరయోధులు స్థాపించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ అణచివేత విధానాలకు..వ్యతిరేకిస్తూ బలంగా తన గొంతుకను వినిపించడానికి నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక ఒక ప్రధాన వేదికగా నిలిచింది.