బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్

Bihar Assembly Election 2025: Counting Begins, Tight Race Between NDA and Mahagathbandhan

బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. మ్యాజిక్ ఫిగర్ 122 కోసం అధికార NDA (ఎన్డీఏ) కూటమి, ప్రధాన ప్రతిపక్ష MGB (మహాఘట్‌బంధన్) కూటమి మధ్య తొలి నుంచే హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రారంభ ట్రెండ్‌లలో ఎన్డీఏ స్వల్ప మెజారిటీకి అటూ ఇటూగా ముందంజలో ఉంది.

తాజా ట్రెండ్‌లు (ఉదయం 8:45 AM – 9:00 AM IST వరకు అందిన సమాచారం ప్రకారం)
  • ఎన్డీఏ (NDA) కూటమి ట్రెండ్‌లలో ముందంజలో ఉంది.

  • దాదాపు 200 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం.
  • బీజేపీ 90, జేడీయూ 78 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి.
  • 190 స్థానాలకు చేరిన ఎన్డీఏ కూటమి ఆధిక్యం.
  • హాఫ్ సెంచరీ మార్క్ కూడా అందుకోలేకపోతున్న మహాఘట్‌బంధన్.
  • మ్యాజిక్ ఫిగర్ (122) దాటిన ఎన్డీయే. 163 స్థానాల్లో లీడింగ్.
  • ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం, ఎన్డీయే 150 సీట్లలో ముందంజలో ఉండగా.. ఎంజీబీ 80 సీట్లలో లీడింగ్ లో ఉంది.

  • బీజేపీ 70, జేడీయూ 66 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి.

  • MGB (మహాఘట్‌బంధన్) కూటమి వెనుకబడి ఉన్నా, గట్టి పోటీ ఇస్తోంది.

  • ఆర్జేడీ 55, కాంగ్రెస్ 17 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
కీలక అంశాలు
  • పోలింగ్ శాతం: ఈసారి బీహార్ చరిత్రలోనే అత్యధికంగా 67.13% పోలింగ్ నమోదైంది.

  • మ్యాజిక్ ఫిగర్: బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సీట్లు అవసరం.

  • చారిత్రక పోలింగ్: ఈ ఎన్నికల్లో చారిత్రక స్థాయిలో 67.13% పోలింగ్ నమోదు కావడంతో, ఇది అధికార వ్యతిరేకతను సూచిస్తుందా లేక అధికార పక్షానికి మద్దతుగా ఉంటుందా అనే చర్చ కొనసాగుతోంది.
  • హోరాహోరీ: పలు నియోజకవర్గాల్లో ఇరు కూటముల మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉంది, ఇది తుది ఫలితంపై ఉత్కంఠను పెంచుతోంది.
  • ఎగ్జిట్ పోల్స్ అంచనా: చాలా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ సునాయాసంగా మెజారిటీ సాధిస్తుందని అంచనా వేశాయి. మహాఘట్‌బంధన్ మాత్రం ఈ అంచనాలకు భిన్నంగా విజయం సాధిస్తామని ధీమాతో ఉంది.

  • కీలక నేతల పరిస్థితి: ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (రాఘోపూర్ స్థానం) తొలి ట్రెండ్‌లలో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (మహువా స్థానం) మాత్రం వెనుకబడి ఉన్నట్లు సమాచారం.

  • ఓవైసీ ప్రభావం: అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని పార్టీ ఏఐఎంఐఎం (AIMIM) సీమాంచల్ ప్రాంతంలో 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here