కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ 4.0 అమలులో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చించి. కానీ ఆదివారం రోజు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంటుందని సీఎం యడియూరప్ప ప్రకటించారు. అయితే తాజాగా ఈ నిబంధన నుంచి వివాహాలకు మినహాయింపు ఇచ్చారు. వచ్చే రెండు ఆదివారాలు అనగా మే 24, మరియు మే 31 నాడు ఇప్పటికే నిశ్చయించిన వివాహాలను జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అతిథుల సంఖ్యను 50 కి మించకూడదని, భౌతిక దూరం పాటించాలని, మరియు ఇతర అన్ని కోవిడ్ నియంత్రణ మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్న క్రమంలోనే ఆదివారాలు నాడు వివాహాలు జరుపుకేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. కంటైన్మెంట్ జోన్లకు చెందిన ప్రజలను ఈ కార్యక్రమాలకు హాజరుకాకుండా చూడాలని, వేదిక ప్రవేశద్వారం వద్ద శానిటైజర్లు మరియు థర్మల్ స్క్రీనింగ్ వాడాలని, వేడుకలో మద్యం, పాన్ వినియోగించకూడని షరతులు విధించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu