భారత్‌లో అఫ్గాన్‌ ఎంబసీని మూసివేత

Closure Of Afghan Embassy In India,Closure Of Afghan Embassy,Afghan Embassy In India,Mango News,Mango News Telugu,Afghan Embassy, Taliban ,Afghan Embassy In India, Mea, Closure Of Afghan Embassy In India, Embassy Center,New Delhi Verifying Claims Of Afghan Embassy,Afghan Embassy In India Suspends,Afghan Embassy Closes Down,India Examining Afghan Embassy,Afghan Embassy Latest News,Afghan Embassy Latest Updates

ఇండియాలో తమ దౌత్య కార్యకలాపాలను ఇకపై మూసివేస్తున్నట్లు అఫ్గనిస్థాన్‌ ఎంబసీ పేరుతో.. కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఓ సందేశం నయా చర్చకు దారి తీస్తోంది.
రాబోయే రెండు రోజుల్లో తమ ఎంబసీని మూసివేయాలని నిర్ణయించినట్లు భారత విదేశాంగ శాఖకు .. ఢిల్లీలోని అఫ్గాన్‌ ఎంబసీ సమాచారం పంపిందట. అయితే ఇందులో నిజమెంతో తెలుసుకోవడానికి ఆ సందేశాన్ని కేంద్రం సునిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అఫ్గనిస్థాన్‌ ఎంబసీ పేరుతో వచ్చిన ఆ సమాచారం అసలు కచ్చితమైనదేనా కాదా? ఈ సందేశం తమకు రావడం వెనుక ఆ దేశమా ఉందా లేక ఎవరైనా ఆకతాయిగా పంపించారా అన్న విషయాలను కేంద్రం పరిశీలిస్తోంది.

నిజానికి కొన్ని నెలలుగా అఫ్గనిస్థాన్‌ రాయబారి భారతదేశంలో ఉండటం లేదు.ఢిల్లీలోని అఫ్గనిస్థాన్‌ దౌత్యవేత్తలు కూడా ఇండియాను వదిలి వరుసగా ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అఫ్గనిస్థాన్‌ ఎంబసీ సిబ్బంది మధ్య.. అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నట్లు ఆమధ్య కథనాలు వచ్చాయి.

భారతదేశంలోని అఫ్గనిస్థాన్‌ ఎంబసీ హెడ్‌ అంబాసిడర్‌ ఫరీద్‌ మమున్‌జే..ఇప్పుడు లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫరీద్‌ మమున్‌జేను గత అష్రాఫ్‌ ఘనీ గవర్నమెంట్ నియమించింది. 2021 సంవత్సరం ఆగస్టులో అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కూడా ఫరీద్‌ మమున్‌జే.. డిల్లీకి రాయబారిగానే కొనసాగుతున్నారు. అయితే, ఈ సంవత్సరం ఏప్రిల్‌, మే నెలలో అఫ్గాన్‌ ఎంబసీలో అధికారం కోసం.. అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి.

ఢిల్లీలోని అఫ్గాన్‌ ఎంబసీ హెడ్‌గా ఫరీద్‌ మమున్‌జే స్థానంలో .. ఖాదిర్‌ షాను ఇంఛార్జ్‌గా తాలిబన్‌ ప్రభుత్వం నియమించింది. ఖాదిర్‌ షా 2020 నుంచి ఎంబసీలో ట్రేడ్‌ కౌన్సిలర్‌గా ఉన్నారు. తన నియామకాన్ని తెలియజేస్తూ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఖాదిర్‌.. భారత విదేశాంగ శాఖకు లేఖ కూడా రాశారు. దీంతోనే ఈ వివాదం మరింత మొదలయినట్లు అయింది. మళ్లీ ఏం జరిగిందో తెలియదు కానీ.. కొన్ని రోజుల తర్వాత అఫ్గాన్‌ దౌత్య కార్యాలయం దీనిపై మరో ప్రకటన చేసింది. అఫ్గాన్‌ ఎంబసీ నాయకత్వంలో తాము ఎలాంటి మార్పు చేయలేదని ప్రకటించింది. ఇలాంటి సమయంలో తాజాగా అఫ్గాన్‌ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నామని అఫ్గాన్‌ ఎంబసీ పేరుతో సందేశం రావడం చర్చనీయాంశం అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =