భారత్ ముక్కలు కాకుండా కాపాడింది ‘వందేమాతరం’ నినాదం – ప్రధాని మోదీ

PM Modi Delivers Key Address in Parliament During Vande Mataram 150th Anniversary Celebrations

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఆరో రోజున ‘వందే మాతరం’ జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లోక్‌సభ మరియు రాజ్యసభల్లో దీనిపై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా వందేమాతరం గేయానికి పునర్‌ వైభవం రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

ప్రధాని మోదీ ప్రసంగం ముఖ్యాంశాలు
  • గర్వకారణం: వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొనడం తనకు గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు.

  • స్వాతంత్య్ర పోరాట గళం: బంకించంద్ర చటర్జీ రాసిన ‘వందేమాతరం’ గేయం స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిందని, మొత్తం దేశానికి శక్తిని, ప్రేరణను ఇచ్చిందని పేర్కొన్నారు.

  • చారిత్రక సందర్భాలు:

    • వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం వలస పాలనలో ఉందని గుర్తు చేశారు.

    • 100వ వార్షికోత్సవం సందర్భంగా దేశం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)లో ఉందని తెలిపారు.

  • పునరుజ్జీవనం, విజన్: వందేమాతరం దేశానికి పునరుజ్జీవాన్ని ఇచ్చిందని, ఆజాద్ భారత్‌కు విజన్‌గా మారిందని ప్రధాని కొనియాడారు. ‘గాడ్ సేవ్ ద క్వీన్’ గీతానికి పోటీగా వందేమాతరం గర్వంగా నిలబడిందని తెలిపారు.

  • భవిష్యత్ స్ఫూర్తి: 2047 నాటి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే వందేమాతరం స్ఫూర్తి ఎంతో అవసరమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నేటి చర్చలు భవిష్యత్ తరానికి స్ఫూర్తిని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • దేశ ఐక్యత: “జననీ జన్మభూమిశ్చ” అన్న రాముడి మాటలకు మరో రూపం వందేమాతరమని, భారత్ ముక్కలు కాకుండా ఈ నినాదం సాయం చేసిందని తెలిపారు. బెంగాల్ ఐక్యతకు ఈ గేయం పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు.

  • బ్రిటిషర్ల దారుణాలు: వందేమాతర నినాదం పలకకూడదని నిషేధం విధించినా, నిషేధం, ఆజ్ఞలు పట్టించుకోకుండా ప్రజలు పోరాటం చేశారని ప్రధాని గుర్తు చేశారు. ఈ నినాదాలు వినలేక బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడ్డారని, ఉద్యమకారులను కఠినంగా అణచివేశారని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here