కేంద్రం కీలక నిర్ణయం, అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ పై గడువు పెంపు

Union Transport Ministry Extends Deadline for FASTag Toll Collection till February 15,Nitin Gadkari,FASTag Mandatory For Vehicles,FASTags Toll Collection,Union Minister Nitin Gadkari,FASTags Toll Collection till February 15,Extends Deadline for FASTag Toll Collection,FASTags To Be Mandatory For All Vehicles,FASTags Deadline Extended,FASTags Toll Collection till Feb 15 2021,FASTags,Nitin Gadkari,Nitin Gadkari Latest News,Union Minister Nitin Gadkari,Union Minister,FASTags For All Vehicles,Union Transport Ministry New Announcement,Mango News,Mango News Telugu,FASTag FASTag Toll Collection Deadline Extends

జనవరి 1, 2021 నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తున్నట్లుగా ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఫాస్టాగ్ ద్వారా జాతీయ రహదారులపై (నేషనల్ హైవే) టోల్ ఛార్జీలు వసూలు విధానాన్ని తప్పనిసరి చేసే గడువును ఫిబ్రవరి 15, 2021 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ గురువారం నాడు ప్రకటించింది. ముందుగా దేశంలో టోల్​గేట్ల వద్ద ట్రాఫిక్​ను ​నియంత్రించడంతో పాటుగా, డిజిట‌ల్‌, ఐటి ఆధారిత చెల్లింపుల‌ను ప్రోత్స‌హించే లక్ష్యంతో 2016 లో ఫాస్టాగ్ విధానాన్ని ప్రారంభించారు. ఇక డిసెంబర్ 1, 2017 నుండి కొత్త నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసిన కేంద్రం, 1989 నాటి మోటారు వాహన చట్టంలో మార్పులు చేస్తూ డిసెంబర్ 1, 2017 కంటే ముందు కొనుగోలు చేసిన 4 చక్రాల పాత వాహనాలకు కూడా ఫాస్టాగ్‌ త‌ప్ప‌నిస‌రి‌ చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 6 =