ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

72 nd Republic Day Celebrations Conducted Grandly In Andhra Pradesh

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, రాష్ట్ర మంత్రులు,  వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ రంగాలపై  ప్రదర్శించిన 14 శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ