ఆ రాష్ట్రంలో ఎక్కువ మద్యం ఇంట్లో ఉంచుకోవాలంటే లైసెన్స్ తప్పనిసరి

Liquor licence, Liquor licence UP government, Mango News, Need to get a License to Store More Liquor at Home, New Excise Policy, New Excise Policy In UP, UP Excise Department, UP government, UP Govt, UP Govt Alters Excise Policy, UP Govt New Excise Policy, UP Govt New Excise Policy 2021, UP Govt New Excise Policy News, Uttar Pradesh, Uttar Pradesh Liquor license, Uttar Pradesh Liquor license mandatory

ఇంటిలో మద్యం నిల్వచేసుకునే విషయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని‌ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిమితిని మించి ఇళ్లలో మద్యం బాటిల్స్ నిల్వచేసుకోవాలంటే తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని సవరించిన ఎక్సైజ్ మార్గదర్శకాల ప్రకారం, ఓ వ్యక్తి నిర్దేశించిన రిటైల్ పరిమితికి మించి మద్యం కొనుగోలు చేయాలన్నా, రవాణా లేదా ఇళ్లలో ఉంచుకునేందుకు ఇకపై లైసెన్స్ పొందవలసి ఉంటుందని పేర్కొన్నారు.

ఒక వ్యక్తికి 6 లీటర్ల మద్యానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అంతకంటే ఎక్కువ మద్యం నిల్వ చేయాలంటే సంవత్సరానికి రూ.12,000 చెల్లించడంతో పాటుగా, 51,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చేసి ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందాలి. అలాగే రాష్ట్రంలో రిటైలర్స్ కు లైసెన్స్ ఫీజును కూడా 7.5 శాతం పెంచుతూ యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) ధరను కూడా పెంచనున్నట్టు సమాచారం. కరోనా లాక్ డౌన్ నష్టాలను పూడ్చడంతో పాటుగా రాష్ట్రంలో ఎక్సైజ్ పై వచ్చే ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + sixteen =