ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్‌, చిత్రకు పద్మభూషణ్‌ అవార్డులు

Chitra, Full list of Padma Vibhushan, List of Padma awardees, List of Padma awardees 2021, Mango News, Padma Awards, Padma Awards 2021, Padma Awards 2021 Full List Of Recipients, padma awards 2021 List, Padma Awards announced, Padma Awards List, Singer Chitra Padma Bhushan, SP Balasubrahmanyam Conferred with Padma Vibhushan, SP Balasubrahmanyam Padma Vibhushan

దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పుర‌స్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరానికి గాను ఏడుగురికి పద్మవిభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించారు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం సహా మొత్తం 16 భారతీయ భాషలలో 40,000 కు పైగా పాటలను బాలసుబ్రహ్మణ్యం పాడారు. దశాబ్దాల పాటుగా తన గానంతో ప్రజలను అలరించిన ఆయన సెప్టెంబర్‌ 25, 2020 న దివంగతులయ్యారు. సంగీతానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందించిన విశిష్టమైన సేవలకు గుర్తుగా కేంద్రప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్‌ అవార్డుతో గౌరవించింది. అలాగే ప్రముఖ సినీగాయని చిత్ర పద్మభూషణ్‌ అవార్డు పొందారు. గాయని చిత్ర వివిధ భారతీయ భాషలలో 25 వేలకు పైగా పాటలను పాడి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఒకరికి పద్మ అవార్డులు లభించాయి. ఏపీ నుంచి కళారంగంలో సేవలకు గానూ రామస్వామి అన్నవరపు, సాహిత్యం, విద్య రంగంలో ప్రకాశ్‌రావు అసవడి, కళారంగంలో నిడుమోలు సుమతి పద్మ అవార్డులు పొందారు. ఇక తెలంగాణ నుంచి కనకరాజుకు కళా రంగంలో పద్మశ్రీ అవార్డు దక్కింది.

పద్మ విభూషణ్:

పద్మభూషణ్:

పద్మ అవార్డులు:

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − nine =