జనసేన పార్టీ కార్యాలయంలో భారత స్వాతంత్య్ర అమృతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ గావించారు. ఆదివారం ఉదయం త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అనంతరం జనసేన పార్టీ శ్రేణులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY




































