వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఓ బిగ్ న్యూస్ తెగ వైరలవుతోంది. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయబోతున్నారంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఆ వార్తలో నిజం ఎంతుందనేది పక్కన పెట్టి నెటిజన్లు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ న్యూస్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయింది. చిత్తుగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసి 151 స్థానాలు దక్కించుకున్న వైసీపీ.. సారి కేవలం 11 స్థానాలకే పరిమితమయిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. అటు లోక్ సభ ఎన్నికల్లో కూడా కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమయిపోయింది. ప్రస్తుతం ఎటూ దిక్కుతోచని పరిస్థితిలో వైసీపీ ఉంది.
అసెంబ్లీలో తమకు ప్రధానప్రతిపక్షం హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. వాస్తవానికి 10 శాతం స్థానాలను దక్కించుకుంటే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. కానీ వైసీపీకి పది శాతం కూడా రాలేదు. కేవలం 11 స్థానాలకే పరిమితమయింది. ఈక్రమంలో సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ స్పీకర్‌కు లేఖ రాశారు. కానీ ఇప్పటి వరకు కూడా జగన్ రాసిన లేఖపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు ఈ లెటర్ ఊసే ఎక్కడా ఎత్తడం లేదు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఇస్తే ముందు ముందు రాజకీయ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికార పక్షం భావిస్తోందట. అందుకే ఆ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా సైలెంట్‌గా ఉండిపోయిందట.
అయితే మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి హోదాలో తన ఎమ్మెల్యేలో జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఇప్పుడు ఒక సాదాసీదా ఎమ్మెల్యేగానే అసెంబ్లీకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష హోదాలో కాకుండా తన పది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎక్కడో ఒక మూలన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను ఎంతగానో ఇబ్బందులను గురి చేశారు. నిండు సభలో చంద్రబాబును అవమనించడంతో.. ఆయన ముఖ్యమంత్రి అయ్యాకనే అసెంబ్లీలో అడుగుపెడుతానని శపథం చేసి మరీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడే అవకాశం దక్కుతుందా? అంటే అనుమానమనే అంటున్నారు.
ఈక్రమంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారని వార్త వైరలవుతోంది. ప్రస్తుత పరిస్థితుల మధ్య ఇక్కడ ఉండడం కంటే ఢిల్లీకి వెళ్లడం ఉత్తమమని జగన్ భావిస్తున్నారట. అందుకే తన సోదరుడు వైఎస్ అవినాశ్ రెడ్డి చేత కూడా కడప ఎంపీగా రాజీనామా చేయించనున్నారట. ఇప్పటికే వైఎస్ అవినాశ్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముందు ముందు ఆ కేసులో ఏమైనా జరిగే అవకాశం ఉంది. అవినాశ్ రెడ్డి అరెస్ట్ అయినా అవ్వొచ్చనే వాదన ఉంది. అందుకే ఆయన చేత రాజీనామా చేయించి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారట. కడప ఎలాగూ వైసీపీకి కంచుకోట. అందువల్ల అక్కడి నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలిచి తీరుతామని జగన్ భావిస్తున్నారట. ఏపీలో పార్టీ పగ్గాలను ఓ కీలక నేతకు అప్పగించి జగన్ ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఓ వార్త తెగ వైరలవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాలను చూస్తుంటే.. ఆ వార్తలో ఎంతో కొంత నిజం ఉందనే వాదన వినిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE