త్వరలోనే పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన రావచ్చు.. ప్రముఖ నటుడు అలీ

Actor Ali Says An Announcement May Come From The Party Office Soon

ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో ప్రముఖ నటుడు అలీ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్‌తో అలీ భేటీ అయ్యారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కుటుంబ సమేతంగా వచ్చిన అలీ సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నిన్న సీఎం ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. అందుకే ఈరోజు ఫ్యామిలీతో వచ్చి మర్యాదపూర్వకంగా సీఎం వైఎస్‌ జగన్‌ గారిని కలిశాను. నాకు ముందునుంచీ వైఎస్ ఫ్యామిలీతో అనుంబంధం ఉంది. సీఎం కాకముందునుంచీ నాకు జగన్ గారితో పరిచయం ఉంది’ అని తెలిపారు అలీ.

‘2019 ఎలక్షన్స్ టైమ్ లోనే నాకు సీట్ ఆఫర్ చేశారు. అయితే, సమయం సరిపోక నేనే వద్దని చెప్పాను. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాను. నాకు ఏ పదవి ఇస్తారనేదానిపై నాకు స్పష్టత లేదు. కానీ, త్వరలోనే గుడ్‌న్యూస్‌ ఉంటుందని సీఎం చెప్పారు. త్వరలోనే నాకు ఇవ్వబోయే పదవిపై పార్టీ ఆఫీస్‌ నుంచి ప్రకటన వస్తుంది. దీనికి సంబంధించి మరో రెండు వారాల్లో ప్రకటన రావచ్చు అని భావిస్తున్నాను. త్వరలోనే సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నా’ అని అలీ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ