మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

janasena chief, janasena chief pawan kalyan, Janasena Chief Pawan Kalyan Greets People of Telangana, Janasena Chief Pawan Kalyan Greets People of Telangana on the Occasion of Medaram Jathara, Mango News, Medaram Jatara Latest Updates, Medaram Jathara, Medaram Jathara Latest News, Medaram Jathara Updates, medaram sammakka sarakka jatara, pawan kalyan, Pawan Kalyan Greets People of Telangana on the Occasion of Medaram Jathara, sammakka sarakka, sammakka sarakka jatara, Sammakka Sarakka Jatara 2022

తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సమ్మక్క–సారలమ్మల మహా జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిమాన్వితమైన మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా అడవితల్లి బిడ్డలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భక్తిపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

“బుధవారం నుంచి మొదలవుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక వైశిష్ట్యానికి నిలువెత్తు నిదర్శనం. అడవి బిడ్డల వీరత్వానికి, ధీరత్వానికి ప్రతీకలు ఈ దేవతలు. తెలంగాణలో అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ వన జాతర దేశానికి తలమానికం. దేశం నలుమూలలోని గిరిజనులు, గిరిజనేతరులు తమ ఇలవేల్పులుగా పూజిస్తున్న ఈ శక్తి స్వరూపిణీల జాతర నయానందకరం, భక్తి ముక్తిదాయకం. మన దేశంలో కుంభమేళా తరవాత కోట్లాదిమంది ఈ జాతరకు ప్రతీసారీ తరలి వస్తున్నారంటే భక్తులు సమ్మక్క సారలమ్మను ఎంతలా ఆరాధిస్తారో అవగతమవుతుంది. కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగు బంగారం మేడారం గద్దె అని భక్తుల విశ్వాసం. ఈ జాతర ఆద్యంతం గిరిజన సంప్రదాయంతో నయనానందకరంగా, అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. తెలంగాణవాసులతో పాటు దేశ ప్రజలందరినీ దుష్ట శక్తుల నుంచి ఈ వనదేవతలు కాపాడి, కరుణ కటాక్షాలతో చల్లగా చూడాలని కోరుకుంటూ ప్రణామాలు అర్పిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 7 =