ఏపీలో వైసీపీ కార్యాలయాల కూల్చివేత వ్యవహారం కాక రేపుతోంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేసింది. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, పట్టణాల్లో ఏర్పాటయిన వైసీపీ కార్యాలయాలపై వివాదం కొనసాగుతోంది. ఎంతో విలువైన భూమలను తక్కువ రేటుకు లీజుకు తీసుకొని.. వాటిలో వైసీపీ కార్యాలయాలను కడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇటు కూటమి నేతలు.. అటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సమయంలో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి స్పందిస్తూ.. వైసీసీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
గత అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో వింతలు చోటు చేసుకున్నాయని పార్థసారథి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ కార్యాలయాలపై విచారణ జరిపిస్తామని.. ముఖ్యమంగా ఆదోని పట్టణంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం విషయంతో విచారణ కచ్చితంగా జరిపించి తీరుతామని స్పష్టం చేశారు. ఆదోనిలోని పాత ఎన్‌జీవో భవనాన్ని 99 ఏళ్లకు వైసీపీ లీజుకు తీసుకుందని.. అది కూడా కేవలం 40 లక్షల రూపాయలకే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
99 ఏళ్లకు కేవలం 49 లక్షల రూపాయల రెంటు చెల్లించడం ఏంటని పార్థసారథి నిలదీశారు. అంటే సంవత్సరానికి ఎంత మొత్తం చెల్లిస్తున్నట్లని ప్రశ్నించారు. కచ్చితంగా ఎన్‌జీవో భవనాన్ని 99 ఏళ్లకు లీజుకు తీసుకోవడంపై విచారణ జరిపించి తీరుతామని అన్నారు. అలాగే తప్పుడు పనులు చేసిన అధికారులను కూడా వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే పార్థసారథి హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE