వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, పలు కీలక ఆదేశాలు

CM Jagan Held Review on Medical and Health Department Orders To Add 754 Procedures in Aarogyasri From Oct 1, CM Jagan Review Medical and Health Department, Jagan Review Medical and Health Department, AP Medical and Health Department, Mango News, Mango News Telugu, Medical and Health Department Orders, Added 754 Procedures in Aarogyasri, Aarogyasri Scheme, 754 Procedures Added In Aarogyasri Scheme, AP Aarogyasri Scheme, AP Aarogyasri Scheme Latest News And Updates, AP Aarogyasri, AP CM YS Jagan Mohan Reddy

అక్టోబర్ 15వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ జాబితాలో కొత్తగా 754 చికిత్సా విధానాలను చేర్చనున్నట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులకి ఆదేశాలిచ్చారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఏపీ వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఏపీ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో మరో 754 విధానాలను చేర్చింది, దాని జాబితాలో చికిత్సా విధానాల సంఖ్యను 3,254కి పెంచిందని సీఎం జగన్ తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

సీఎం జగన్ ప్రసంగం లోని కొన్ని కీలక అంశాలు..

  • ప్రస్తుతం ఆరోగ్యశ్రీ జాబితాలో 2,446 ఉండగా, మరో 754 చికిత్సలను కొత్తగా చేర్చామని, దీంతో ఆరోగ్యశ్రీలో అందిస్తున్న మొత్తం చికిత్సల సంఖ్య 3,254కి చేరిందని వెల్లడి.
  • అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ కొత్త ప్రొసీజర్లను చేర్చాల్సిందిగా ఆదేశం.
  • ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకానికి చేస్తోన్న ఖర్చు మూడు రేట్లు పెరిగినట్లు వెల్లడి.
  • పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్యశ్రీకి రూ.. 2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం రూ. 300 కోట్లు అందిస్తున్నామని వెల్లడి.
  • అలాగే 108, 104 సేవల కోసం రూ. 400 కోట్లు కేటాయిస్తున్నామని, దీంతో రూ. 3,200 కోట్లు ఇస్తున్నామని తెలిపారు.
  • ఇక కొత్తగా 104 సేవల కోసం 432 వాహనాలు డిసెంబర్ నాటికీ అందుబాటులోకి వస్తాయని హామీ.
  • విలేజ్ క్లినిక్స్ లలో కోవిడ్ కిట్ కూడా అందించాలని అధికారులకి ఆదేశాలు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here