ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసుకి సంబంధించిన విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పిటీషన్లపై త్వరగా విచారణ చేపట్టి, వాదనలు ముగించాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపై స్పష్ట ఇచ్చింది. వచ్చే నెల 28న విచారణ చేపడతామని తెలిపింది. కాగా గతవారం దీనిపై విచారణ చేపట్టాల్సి ఉండగా.. రాజ్యాంగ ధర్మాసనం బుధవారం మరియు గురువారాల్లో మిస్ లేనియస్ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేసింది. దీంతో ఈ కేసు విచారణ ఒకసారి వాయిదా పడింది.
ఇక సుప్రీం తాజా నిర్ణయంతో జస్టిస్ కేఎం జోసెఫ్ మరియు జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు విచారణ జరుగనుంది. కాగా రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. దీనిని సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను, అమరావతి అంశంపై దాఖలైన పిటీషన్లను వేర్వేరుగా విచారించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE