పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Expresses Grief Over Demise Of Pg Medical Student Preethi, Janasena Chief Pawan Kalyan,Pawan Kalyan Expresses Grief Over Student Preethi, Demise Of Pg Medical Student Preethi, Janasena Chief Expresses Over Medical Student Preethi, Mango News, Mango News Telugu, Nims Hospital Hyderabad,Nims Hospital Panjagutta Contact Number,Warangal News,Warangal News Live,Warangal News Today English,Warangal News Today Telugu,T Harish Rao Email Address,T Harish Rao Twitter,Ex Gratia Government Of India,Janasena Party Leaders List,Janasena Chief Pawan Kalyan,Janasena Mla List,Janasena Party Members List,Janasena Party Membership Number,Janasena Party Mla Name,Janasena Party Pawan Kalyan Contact Number,Janasena Party Pawan Kalyan Phone Number,Janasena Pawan Kalyan Email Id,Pawan Kalyan Political Career,Salary Of Pawan Kalyan

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

“సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకొంటే హృదయం ద్రవించింది. తమ బిడ్డను సైప్ వేధిస్తూ, కించపరుస్తూ ఉన్నాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ బాధ్యులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి. కళాశాలలో ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్, వేదింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలి. సీనియర్ విద్యార్థుల ఆలోచన ధోరణి మారాలి. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడటం, ఆధిపత్య ధోరణి చూపడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − one =