200వ రోజుకి చేరిన అమరావతి రైతుల నిరసనలు

Amaravati Farmers Protest, Amaravati Farmers Protest Against State Government, Amaravati Farmers Protest Reaches to 200 days, Andhra Pradesh, AP Capital Amaravati, AP Capital Amaravati Issue, AP Capital Issue, AP Capital Latest News, AP Capital News, AP Capitals Bill, AP News, Capital Amaravati Farmers Protest

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 200 వ రోజుకి చేరుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన సమయంలో కూడా రైతులు కొన్ని ప్రాంతాల్లో నిరసనలు కొనసాగించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విజయవాడ లోని జేఏసీ కార్యాలయం వద్ద ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులు, రైతు కూలీలకు జేఏసీ నేతలు, రైతులు నివాళులు అర్పించారు. పలువురు రైతులు దీక్షలో కూర్చోగా వారికీ మద్దతుగా మహిళలు కూడా దీక్షలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు రైతులు, జేఏసీ నేతలు ఈ దీక్షను కొనసాగించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu