ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, APERC New Chairman, CV Nagarjuna Reddy Takes Oath As APERC Chairman, Justice CV Nagarjuna Reddy As APERC New Chairman, Justice CV Nagarjuna Reddy Takes Oath As APERC Chairman, Justice CV Nagarjuna Reddy Takes Oath As APERC New Chairman, Mango News Telugu

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి, అక్టోబర్ 30 బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి చేత రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్ ఆయన్ను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జస్టిస్‌ నాగార్జునరెడ్డికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియజేసారు.

జస్టిస్‌ నాగార్జునరెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ హైకోర్టుల్లో న్యాయమూర్తిగా, పలు ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సెల్ లలో, మరికొన్ని సంస్థలకు లీగల్ అడ్వైజర్ గా కూడ వ్యవరించారు. ఇప్పటివరకు ఏపీఈఆర్‌సీ ఛైర్మన్‌ పనిచేసిన జస్టిస్‌ జి.భవానీప్రసాద్‌ పదవీ కాలం అక్టోబర్ 29, మంగళవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, అనిల్‌కుమార్‌, ట్రాన్స్‌కో సీఎండీ నాగుపల్లి శ్రీకాంత్‌, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here