ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మే 20, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయింది. ముందుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో 2021-22 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2,29,779.27 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందించింది. మరోవైపు శాసనమండలిలో హోంమంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఏపీ బడ్జెట్ 2021-22 హైలైట్స్:
- బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,29,779.27 కోట్లు
బడ్జెట్ కేటాయింపులు:
- కరోనాపై పోరాటానికి రూ.1000 కోట్లు
- ఎస్సీ సబ్‌ప్లాన్ – రూ.17,403 కోట్లు
- ఎస్టీ సబ్ ప్లాన్ – రూ.6,131 కోట్లు
- బీసీ సబ్ ప్లాన్ – రూ.28,237 కోట్లు
- కాపు సంక్షేమం – రూ.3,306 కోట్లు
- ఈబీసీ సంక్షేమం – రూ.5,478 కోట్లు
- బ్రాహ్మణ సంక్షేమం – రూ.359 కోట్లు
- మైనార్టీ యాక్షన్ ప్లాన్ – రూ. 3,840.72 కోట్లు
- పిల్లలు, చిన్నారుల కోసం బడ్జెట్‌లో రూ.16,748 కోట్లు కేటాయింపు
- మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు
- వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు
- విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు
- వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
- ఉన్నత విద్యకోసం – రూ.1,973 కోట్లు
- డా.వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలు – రూ.2,248.94 కోట్లు
- ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం – రూ.1,535 కోట్లు
- పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం – రూ.3,500 కోట్లు
- అమ్మ ఒడి పథకం – రూ.6,107 కోట్లు
- వైఎస్ఆర్ పెన్షన్ కానుక – రూ.17,000 కోట్లు
- వైఎస్ఆర్ రైతు భరోసాకు – రూ.3,845 కోట్లు
- వైఎస్ఆర్ కాపు నేస్తంకోసం – రూ.500 కోట్లు
- వైఎస్ఆర్–పీఎం ఫసల్ బీమా యోజన – రూ.1,802 కోట్లు
- వైఎస్ఆర్ జగనన్న చేదోడు పథకం – రూ.300 కోట్లు
- వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం – రూ.285 కోట్లు
- వైఎస్ఆర్ నేతన్న నేస్తం – రూ.190 కోట్లు
- వైఎస్ఆర్ మత్స్యకార భరోసా – రూ.120 కోట్లు
- వైఎస్ఆర్ చేయూత కోసం రూ. 4,455 కోట్లు
- వైఎస్ఆర్ ఆసరా – రూ.6,337 కోట్లు
- వైఎస్ఆర్ బీమా – రూ.372.12 కోట్లు
- వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ – రూ.1,556.39 కోట్లు
- వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ – రూ. 243.61 కోట్లు
- వైఎస్ఆర్ టెస్టింగ్ ల్యాబ్స్ – రూ. 88.57 కోట్లు
- వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం – రూ.1802.82 కోట్లు
- వైఎస్ఆర్ పశువుల నష్టపరిహార పథకం – రూ. 50 కోట్లు
- వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్‌మాన్యుఫాక్చరింగ్ – రూ. 200 కోట్లు
- వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెల్లింపులు – రూ. రూ.865 కోట్లు (డ్వాక్రా సంఘాలుకు)
- వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెల్లింపులు – రూ. రూ.247 కోట్లు (పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు)
- జగనన్న విద్యా దీవెన – రూ.2500 కోట్లు
- జగనన్న గోరుముద్ద – రూ.1,200కోట్లు
- జగనన్న విద్యాకానుక – రూ.750 కోట్లు
- జగనన్న వసతి దీవెన – రూ.2,223.15 కోట్లు
- నీటిపారుదల శాఖకు కేటాయింపులు – రూ.13,237.78 కోట్లు
- హౌసింగ్, మౌలిక సదుపాయాలు – రూ.5,661 కోట్లు
- పరిశ్రమలకు ఇన్సెంటివ్ లు – రూ.1000 కోట్లు
- కడప స్టీల్‌ప్లాంట్ కోసం రూ. 250 కోట్లు
- పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి – రూ.3,673.34 కోట్లు
- రోడ్లు భవనాల శాఖ – రూ.7,594.6 కోట్లు
- ల్యాండ్ రీ-సర్వే – రూ.206.97 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ – రూ. 8,727 కోట్లు
- రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపులు – రూ.500 కోట్లు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ