కందుకూరు తొక్కిసలాట ఘటనపై ఏపీ పోలీసుల నజర్, కేసు నమోదు

AP Police Registered Case Against The Stampede Incident During TDP Chief Chandrababu Road Show in Kandukur,AP Police Registered Case,Stampede Incident,TDP Chief Chandrababu Road Show,Kandukur Chandrababu Stampede Incident,Mango News,Mango News Telugu,Stampede at TDP Meeting,TDP Meeting in Kandukur,TDP Chief Chandrababu,Chandrababu's Public Meeting,Chandrababu Meeting in Kandukur,Chandrababu Meeting,Chandrababu Kcr,Chandrababu Meeting Live,Chandrababu Kuppam Tour,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కుందుకూరు పట్టణంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రోడ్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 174 కింద కుందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక పోలీసులు ఈ ఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చనున్నారు. అయితే దీనిపై ప్రతిపక్ష టీడీపీ స్పందించింది. ఈ ఘటనకు పోలీసుల భద్రత సరిగా లేకపోవడమే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. రోడ్డుషోకి పెద్ద సంఖ్యలో జనం వస్తారని పోలీసులకు సమాచారం అందించినా సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు.

కాగా ఈ ఘటనలో కాలువలో పడి ఇద్దరు మహిళలు సహా ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కందుకూరు ఏరియా ఆస్పత్రిలో శవపరీక్ష అనంతరం అధికారులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ క్రమంలో మృతదేహాలను స్వగ్రామాలకు తరలించిన అనంతరం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తామని ప్రతిపక్ష టీడీపీ ప్రకటించింది. అలాగే వారి అంత్యక్రియల్లో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలను, కార్యకర్తలను కోరారు. ఇక తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఆయన వారికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసానిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 15 =