ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది. ప్రస్తుతం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేస్తూ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఇక దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ కు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
కాగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఇప్పటివరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రామ్‌ప్రకాశ్ సిసోడియాను బదిలీ చేస్తూ, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కే.ఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE






































