ఏపీలో వైసీపీ సర్కార్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం.. ‘జగనన్నకు చెబుదాం’ త్వరలోనే ప్రారంభం

YCP Govt To Launch New Public Connect Programme Jaganannaku Chebudam Soon in AP, YCP Govt Launch Public Connect Programme, Jaganannaku Chebudam, AP Jaganannaku Chebudam Programe, Mango News, Mango News Telugu, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం త్వరలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వ పనితీరుపై సంబంధించి మరియు వారి సమస్యలు లేదా వినతులపై డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ కోసం ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి సంబంధించి విధివిధానాలపై సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయనుంది.

తద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అమలవుతున్న తీరు, ఇంకా ఇతరత్రా సమస్యలపై ప్రజలు నేరుగా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసే అవకాశం లభించనుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి పరిష్కారం చూపించే దిశగా ఈ కొత్త కార్యక్రమం చేపట్టనున్నామని, దీనిద్వారా మరింత సులువుగా ప్రజలతో మమేకమవ్వొచ్చని నేతలు, అధికారులతో సీఎం జగన్ చెప్పారు. అలాగే ఏపీ సర్కార్ ఇప్పటికే నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమం కన్నా మరింత మెరుగ్గా దీనిని నిర్వహించాలని అధికారులకి ఆయన కీలక సూచనలు చేశారు. కాగా ఇది పశ్చిమ బెంగాల్‌లో విజయవంతంగా అమలవుతున్న ‘దీదీ కో బోలో’ స్ఫూర్తిగా ‘జగనన్నకు చెబుదాం’ రూపకల్పన చేస్తున్నట్లు ఏపీ సీఎంఓ వర్గాలు తెలిపాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 11 =