విజయవాడలో బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌-2 ప్రారంభోత్సవం.. పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు (గురువారం) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో గడ్కరీ 52 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటి మొత్తం విలువ రూ. 21,600 కోట్లు. విజయవాడ కేంద్రంగా నిర్మాణం పూర్తి అయిన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ వంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో.. విజయవాడలోని 88 కోట్ల రూపాయలతో నిర్మించిన బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్‌ను నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులను సమీక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ