టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్

Telangana PCC President Revanth Reddy Arrested Ahead of Protests, Telangana PCC President Revanth Reddy Arrested, Telangana PCC President, Revanth Reddy Arrested Ahead of Protests, TPCC President Revanth Reddy Arrested Ahead of Protests, TPCC President Arrested Ahead of Protests, TPCC President Arrested, Revanth Reddy Arrested, Telangana Congress working president Revanth Reddy, Telangana Congress working president Revanth Reddy Arrested, Telangana Congress working president Revanth Reddy Arrested Ahead of Protests, Telangana Congress working president, Revanth Reddy, TPCC President Revanth Reddy Arrested, Telangana, Telangana Latest News, Telangana Latest Updates, Mango News,Mango News Telugu,

తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో.. పోలీసులు రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా, రాష్ట్రంలో ఓ వైపు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా మూడు రోజుల పాటు జరపడాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కానీ వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రేవంత్ ఆరోపించారు. నోటిఫికేషన్లు రాక, నిరుద్యోగ భృతి లేక చాలా మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏం సాధించారని సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈరోజు 11 గంటలకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక గాడిదకు జన్మదినాన్ని జరపాలని ఓ నిరసన కార్యక్రమాన్ని గాంధీభవన్‌ వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొనవచ్చని భావించి అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్తగా రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =