ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

Andhra Pradesh : Several IAS Officers Transferred

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఆంధప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పోలా భాస్కర్‌ను కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ గా బదిలీ చేశారు. అలాగే తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు సాంకేతిక విద్య డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ ను ప్రకాశం జిల్లా కలెక్టర్‌ గా బదిలీ చేశారు.

మరోవైపు పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్‌ అధికారి ఎస్‌ సత్యనారాయణను ఏపీ టూరిజం ఎండీగా, పీ బసంత్‌కుమార్‌ ను మున్సిపల్‌ శాఖ కింద ఏర్పాటు చేసిన ఎంఐజీ ప్రాజెక్ట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ గా నియమించారు. అలాగే తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఏపీయూఎఫ్ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా కూడా బసంత్‌కుమార్‌ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ