ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం (డిసెంబరు 21న) వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ వ్యాప్తంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని, మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ప్లాన్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలతో లబ్ది పొందిన వారంతా పాల్గొంటారని వెల్లడించారు. అలాగే ‘వైఎస్సార్సీపీ బ్లడ్ డొనేషన్.కామ్’ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామని, రక్తదానం చేయాలనుకునేవారు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా క్రీడల పోటీలు, 20వ తేదీన మొక్కలు నాటడం.. అలాగే 21వ తేదీన పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ