పద్మాలయ స్టూడియోలో సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహం.. కడసారి చూసేందుకు తరలివస్తున్న అభిమానులు, ప్రజలు

Superstar Krishna's Mortal Remains Taken To Padmalaya Studios Huge No of Fans and Common People Comes to Pay Tribute, Superstar Krishna's Remains To Padmalaya Studios, Huge Fans Comes to Pay Tribute,,Mango News,Mango News Telugu,Actor Superstar Krishna,Superstar Krishna,Senior Actor Krishna,Superstar Krishna Latest News And Updates,Actor Krishna, Actor Krishna Hospitalized,Krishna Hospitalized,Krishna News And Live Updates,Superstar News And Updates

సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహాన్ని మరికాసేపట్లో పద్మాలయ స్టూడియోకు తరలించారు. కార్డియాక్‌ అరెస్టుతో సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేరిన కృష్ణ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న వారి స్వగృహంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయనకు భారీగా అభిమాన గణం ఉన్న నేపథ్యంలో బుధవారం సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహాన్ని వారి సందర్శనార్ధం పద్మాలయ స్టూడియోకు తరలించారు. దీంతో అక్కడ ఆయనను కడసారి దర్శించుకునేందుకు అభిమానులతోపాటు, సాధారణ ప్రజలకు బారులు తీరారు. కాగా ఈరోజు మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం స్టూడియోలోనే కృష్ణ పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక కృష్ణ మృతికి సంతాపంగా చిత్రపరిశ్రమ నేడు బంద్ పాటిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − seven =