మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు

Andhra Pradesh, AP BJP President Somu Veerraju, AP BJP President Somu Veerraju Meets Megastar Chiranjeevi, bjp, BJP President Somu Veerraju, Chiranjeevi, Hyderabad, Somu Veerraju Meets Megastar Chiranjeevi at Hyderabad

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం నాడు ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని కలిశారు. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు సోము వీర్రాజును చిరంజీవి సత్కరించి, అభినందనలు తెలిపారు. పార్టీని అభివృద్ధి చేయడంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహాయసహకారాలు తీసుకొని ముందుకు వెళ్లమని చిరంజీవి సూచించారని సోమువీర్రాజు అన్నారు. ఆయన సూచన తప్పక పాటించి బీజేపీ-జనసేన పొత్తును ఆంద్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ శక్తిగా నిలుపుతామని సోమువీర్రాజు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu