ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో ఔట్, బీసీసీఐ అధికారికంగా ప్రకటన

bcci, IPL, IPL 2020, IPL 2020 In UAE, IPL 2020 Latest News, IPL 2020 Latest Updates, IPL 2020 Live Updates, IPL title sponsor, Vivo will not be the IPL title sponsor, Vivo will not be the IPL title sponsor this year

ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలగాలని వివో నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 5, గురువారం నాడు వివో అభ్యర్ధనను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అంగీకరించింది. వివో‌ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టుగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 2018 లో ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కు సంబంధించి ఐదేళ్ల కాలానికి రూ.2190 కోట్లతో బీసీసీఐతో వివో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్‌-చైనా వివాదం నేపథ్యంలో చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ఐపీఎల్ కు స్పాన్సర్‌గా కొనసాగడంపై దేశంలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఒప్పందం రద్దుకు వివో మొగ్గు చూపింది. ఒప్పందం రద్దుపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ఐపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో టైటిల్‌ స్పాన్సర్‌ కోసం బీసీసీఐ వెతుకులాట ఆరంభించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో టైటిల్‌ స్పాన్సర్‌షిప్ ఎవరూ దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here