ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇకపై వీఆర్వోల సర్వీసులలో కారుణ్య నియామకాలకు అవకాశం

AP Govt Issues GO Regarding Opportunity For Compassionate Appointments in VRO Services, Compassionate Appointment, VRO Compassionate Appointments, Andhra Pradesh Govt. Employees Association, Mango News, Mango News Telugu, Compassionate Appointments to Dependents, A.P. Compassionate Appointment Gos, Compassionate Appointment V.R.O, VRO New GO, Village Revenue Officer, VRO Lateste News And Updates, VRO AP Govt, AP Govt News And Liv e Updates

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వారి కోరిక మేరకు కారుణ్య నియామకాలకు ఓకే చెప్పింది. భాగంగా రాష్ట్రంలోని గ్రేడ్-1, గ్రేడ్-2 గ్రామ రెవిన్యూ అధికారుల (వీఆర్వో) సర్వీసు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం సర్వీసులో ఉన్న ఒక వీఆర్వో ఏదేని కారణంతో మరణిస్తే వారి కుటుంబంలో అర్హత ఉన్నవారికి ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించేలా నిబంధనల్లో సవరణ చేశారు. ఈ మేరకు సర్వీసు నిబంధనలు-2008లో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం గ్రేడ్-1, గ్రేడ్-2 వీఆర్వోల కుటుంబంలో భార్య/భర్త లేదా పిల్లల్లో ఎవరైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. అప్పుడు వీరికి కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్ మరియు దీనికి సమానమైన పోస్టులలో భర్తీ చేసే వీలుంటుంది. కాగా ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఏపీ సర్కార్ నిర్ణయంపై వీఆర్వోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకాలంగా తాము చేస్తున్న విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నందుకు వారు కృతఙ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 13 =