ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు?

Andhra Pradesh, AP Cabinet Meet, AP Cabinet Meeting, AP Cabinet Meeting 2020, AP Cabinet Meeting Latest Updates, AP Cabinet Meeting Started in Secretariat, AP Cabinet Meeting Updates, AP CM YS Jagan, AP Government, AP News, AP Political Updates, YS Jagan Cabinet Meeting

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూన్ 11, గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 40 అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకం, రాష్ట్రంలో చిరువ్యాపారులకు ప్రభుత్వ సహాయం పథకంపై కీలకంగా చర్చించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, వైద్య, ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తో పాటుగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో సుదీర్ఘ లాక్‌డౌన్ అమలు ‌అనంతరం తొలిసారిగా కేబినెట్‌ సమావేశం జరుగుతుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu