విశాఖలో ముగిసిన జీ-20 సదస్సు.. మూడు రోజుల పాటు పలు అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు

G20 Summit Meetings Completed in Visakhapatnam Delegates Discussed on Several International Issues,G20 Summit Meetings Completed in Visakhapatnam,G20 Summit Delegates Discussed,G20 Summit Several International Issues,Mango News,Mango News Telugu,G20 Summit,G20 Summit 2023,G20 India,G20 Summit 2023 India LIVE,G20 Summit LIVE,G20 India LIVE,G20 India 2023,2023 G20,Visakhapatnam G20 Summit Latest News,Visakhapatnam G20 Summit Live News,Visakhapatnam G20 Summit Latest Updates

ఆంధ్రప్రదేశ్ లోని సాగరతీరమైన విశాఖపట్నంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 సభ్యదేశాల వర్కింగ్‌ గ్రూపు సదస్సు గురువారం ముగిసింది. ‘వన్‌ ఎర్త్‌, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌’ అనే థీమ్‌తో తలపెట్టిన ఈ అంతర్జాతీయ సదస్సు 28 నుంచి 3 రోజులపాటు జరిగింది. దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరైన ఈ జీ-20 సదస్సులో పలు అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు జరిపారు. దీనిలో భాగంగా.. సభ్యదేశాల మధ్య ఆర్థికాభివృద్ధిలో పరస్పర సహకారం, వ్యాపార, వాణిజ్యాభివృద్ధిలో పరస్పర ఒప్పందాలపై విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. ఇక చివరి రోజైన గురువారం సభ్యదేశాల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగపూర్‌, దక్షిణ కొరియా దేశాల ప్రతినిధులు వారు అమలు చేస్తున్న ఉత్తమ ప్రాజెక్టుల అనుభవాలను వివరించారు.

అలాగే వ్యర్థ జలాల నిర్వహణ, సమీకృత మాస్టర్‌ ప్లాన్‌లపై సింగపూర్‌కు చెందిన నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ అహ్‌టాన్‌ లోహ్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. కాగా జీ-20 తదుపరి సదస్సు జూన్‌ 26-28 మధ్య ఉత్తరాఖండ్‌ లోని రిషీకేశ్‌లో జరుగనుందని నిర్వాహకులు ప్రకటించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం నేపథ్యంలో ఆ ప్రతినిధి బృందం విశాఖలో క్షేత్ర పర్యటన చేపట్టింది. ఈ క్రమంలో ఏషియన్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్ సహకారంతో నడుస్తున్న నిరంతర తాగు నీటి సరఫరా విధానాన్ని ఈ బృందం పరిశీలించింది. అలాగే ప్రతినిధులు మహా విశాఖ నగర పాలక సంస్థ ముడసర్లోవ పార్కులో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంటు మరియు కాపులుప్పాడలో జిందాల్‌ సంస్థ నిర్వహిస్తున్న వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును పరిశీలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 1 =