ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ముఖ్యంగా జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం పథకం పేరుతో ఇటీవల ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ప్రకటించిన 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానంకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఇసుక సరఫరా నూతన విధానం, మచిలీపట్నం పోర్టు డీపీఆర్, పోలవరం సహా పలు సంక్షేమ పథకాలపై కేబినెట్ లో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ






































