ఆ రాష్ట్రంలో రేపటి నుంచే సినిమా థియేటర్స్ ఓపెన్

Maharashtra, Maharashtra Govt, Maharashtra Govt Gives Permission to Open Cinema Theaters, Maharashtra Lockdown, Maharashtra Lockdown News, Maharashtra Lockdown updates, Maharashtra News, Maharashtra Open Cinema Theaters, Maharashtra Permission to Open Cinema Theaters

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్, మల్టిఫ్లెక్సులు మూతపడిన సంగతి తెలిసిందే. అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా 50 సీటింగ్ సామర్థ్యంతో అక్టోబర్ 15‌ నుంచే సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కొన్ని రాష్ట్రాలు సినిమా థియేటర్స్ కు అనుమతి ఇవ్వగా, మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో అనుమతి ఇవ్వడం లేదు. తాజాగా నవంబర్ 5, గురువారం నుండి కంటైన్మెంట్ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, డ్రామా థియేటర్లు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో తెరవొచ్చని పేర్కొన్నారు. అయితే ఆడిటోరియం లోపలకి బయటనుంచి ఫుడ్ తీసుకురావడానికి అనుమతి ఉండదని తెలిపారు. భౌతిక దూరం మరియు శానిటైజేషన్ వంటి కరోనా నిబంధనలను థియేటర్ల వద్ద తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 2 =