తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 71వ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. “అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలంటూ” చంద్రబాబు గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అనంతరం చంద్రబాబు స్పందిస్తూ సీఎం వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవిలకు ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు జన్మదినం సందర్భంగా పలు రాష్ట్రాల ప్రముఖ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. సామాజిక మాధ్యమాల వేదికగా చంద్రబాబు అభిమానులు #HBDPeoplesLeaderCBN అనే హ్యాష్ టాగ్ ను ట్రెండ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Best wishes to @ncbn garu on his birthday. May he be blessed with happiness and good health.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2020
Thank you @ysjagan Garu. Appreciate it much! https://t.co/eyBwA0yayz
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 20, 2020
అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను. Wishing you a happy 70th Birthday Sir @ncbn Your vision, your hard work, your dedication are exemplary pic.twitter.com/aM9uRzEZZH
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2020
Happy to receive your warm wishes @KChiruTweets Garu! Heartfelt thanks to you!! https://t.co/fjibnqaqRw
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 20, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu