ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లా పర్యటన రద్దు అయ్యింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో సీఎం జగన్ కాలు బెణకిందని, సాయంత్రానికి నొప్పి మరింత పెరిగిందని వారు తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎంవో అధికారిక ట్విట్టర్ లో తెలియజేశారు. గతంలో కూడా ఒకసారి ఇలాగే సీఎం జగన్ కాలికి గాయం అయిందని, అప్పుడు చాలా రోజులపాటు ఆయన బాగా ఇబ్బందిపడ్డారని వెల్లడించారు. తాజాగా మళ్లీ కాలినొప్పి రావడంతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా చెప్పారు. దీంతో బుధవారం కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయ దర్శన పర్యటనను రద్దు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈరోజు సీఎం జగన్ ఒంటిమిట్ట ఆలయంలో కోదండరామ స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంది. శ్రీరామ నవమి మరియు బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో నేడు ఆలయంలో సీతారామ కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్కు కాలినొప్పి*. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 4, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE






































