కరీంనగర్‌లో అర్థరాత్రి హైడ్రామా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌, తీవ్ర ఉద్రిక్తత

Telangana BJP Chief Bandi Sanjay Arrested Amid High Tension at Midnight in Karimnagar,Telangana BJP Chief Bandi Sanjay Arrested,Amid High Tension at Midnight in Karimnagar,BJP Chief Bandi Sanjay Arrested,Mango News,Mango News Telugu,BJP Telangana Chief Bandi Sanjay Taken Into Custody,Telangana BJP Chief Arrested,Telangana BJP president Bandi Sanjay,High Tension At Bandi Sanjay House After Arrest,High Tension In Bommala Ramaram Police Tension,BJP Chief Bandi Sanjay Latest News,BJP Chief Bandi Sanjay Latest Updates

కరీంనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అసలేమైందంటే.. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత బండి సంజయ్‌ నివాసం వద్ద భారీ బలగాలను మోహరించిన పోలీసులు, ఆయన ఇంటిలోపలికి ప్రవేశించి అరెస్ట్‌ చేయడానికి వచ్చామని చెప్పారు. అయితే తన అరెస్టుకు కారణంగా చూపించాలని, వారెంటు చూపాలని పోలీసులతో సంజయ్‌ వాగ్వాదానికి దిగారు. మరో వైపు బండి సంజయ్‌ని అరెస్టు చేస్తున్నారనే ప్రచారంతో కరీంనగర్‌ పట్టణంలోని బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో సంజయ్‌ను పోలీసులు ఇంటి నుండి బలవంతంగా బయటకు తీసుకొచ్చి బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటన మధ్యే సంజయ్‌ను వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి యాదగిరిగుట్టకు తరలించారు. అయితే తిమ్మాపూర్‌ మీదుగా సంజయ్‌ను తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఆయనను ఎక్కించిన వాహనం మొరాయించడంతో పోలీసులు మరో వాహనంలో ఎక్కించి.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా నిన్న జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బండి సంజయ్‌ అత్త మరణించి తొమ్మిది రోజులు అయిన క్రమంలో దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన కరీంనగర్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

ఇక మంగళవారం పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్‌ లీక్‌ ఘటన నేపథ్యంలో.. దీనికి కారకులైన వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన వరంగల్‌ సీపీ రంగనాథ్‌, దీనికి సూత్రధారిగా భావిస్తున్న ప్రశాంత్‌ వ్యవహారంపై విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో నిన్న ఉదయం నుంచి ప్రశాంత్‌ ఏమేం చేశాడన్న దానిపై కూపీ లాగిన ఆయన.. నిన్న ఉదయం 9:45కు పేపర్‌ లీకైన తర్వాత 9:59కి ఎస్ఎస్‌సీ వాట్సాప్‌ గ్రూప్‌లోకి ఈ పేపర్ వచ్చినట్లు గుర్తించారు. అనంతరం 10:45కి మరికొన్ని ప్రైవేట్ గ్రూపుల్లో పోస్ట్ అయినట్లు నిర్ధారించారు. ప్రశాంత్‌ పలు మీడియా సంస్థల ప్రతినిధులకు పేపర్‌ పంపాడని.. ఈ క్రమంలో 11:30కి బండి సంజయ్‌కి కూడా ఈ పేపర్‌ వెళ్లిందని గుర్తించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారనే కారణంపై వరంగల్‌ సీపీ రంగనాథ్‌ కఠిన చర్యలకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌ అరెస్ట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =