పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల శాంపిల్స్ పై పరిశోధనలు చేసిన కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్ధల శాస్త్రవేత్తలు, నిపుణులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. పలువురు ప్రజలు అస్వస్థతకు గురవడానికి పురుగు మందుల అవశేషాలే కారణమని ఢిల్లీ ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా పలు సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే పురుగుమందుల అవశేషాలు ప్రజల శరీరాల్లోకి ఎలా ప్రవేశించాయనే అంశంపై మరింత అధ్యయనం చేయవలసిన అవసరమని ఉందని నిపుణులు పేర్కొన్నట్టు తెలుస్తుంది.
అనంతరం ఈ ఘటనపై అధ్యయన బాధ్యతల్ని ఢిల్లీ ఎయిమ్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి అప్పగిస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏలూరులో క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆహారం, తాగునీరు నమూనాలపై పరీక్షలు నిర్వహించి, పలితాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సంబంధిత ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, ఏలూరు లాంటి ఘటనలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ