చిత్తూరు జిల్లాలో జూన్ 15 వరకు కర్ఫ్యూ, ఉదయం 10 గంటల వరకే ప్రజలకు అనుమతి

Andhra Pradesh COVID Restrictions, Chittoor Curfew, Chittoor District, Curfew Extended in Chittoor District, Curfew extended till June 15 in Chittoor district, Curfew Extended upto June 15th in Chittoor District, Curfew in Chittoor, Curfew in Chittoor Extended, Curfew Time Extended In Chittoor, Curfew Time Extended In Chittoor District, Curfew timings extended in the Chittoor district, Mango News, People were allowed only till 10 AM

చిత్తూరు జిల్లాలో కరోనా నియంత్రణలో భాగంగా కర్ఫ్యూను జూన్ 15వ తేదీ వరకు విధించాలని నిర్ణయించినట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం నాడు చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా కర్ఫ్యూను మరింత కఠినంగా అమలుచేయనున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం ఏపీలో కర్ఫ్యూ అమల్లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలకు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్ 1 నుంచి జూన్ 15 వరకు జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు. నిత్యావసరాలు/సరుకులు కొనుగోలుకు ఉదయం 10 గంటల వరకే అనుమతి ఉంటుందని, అప్పటినుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 19 =