ఆంధ్రప్రదేశ్‌లో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తరువాత సాయుధ దళాల గౌరవవందనాన్ని స్వీకరించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వీక్షించారు.
అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక, ఆర్ధిక భరోసాను మన రాజ్యాంగం కల్పించిందని అన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు గొప్పగా లేకున్నా ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఆసరా సహా పలు పథకాలు ప్రవేశపెట్టామని, కుల,మత,పార్టీలలకు అతీతంగా అందరికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu