చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్‌

AP CM YS Jagan, Ap Political News, Challa Ramakrishna Reddy Death, Challa Ramakrishna Reddy Family, Kurnool, Mango News Telugu, MLC Challa Ramakrishna Reddy, MLC Challa Ramakrishna Reddy dies of Covid 19, MLC Challa Ramakrishna Reddy Family, YS Jagan Meets of MLC Challa Ramakrishna Reddy Family, YSR Congress, YSRCP MLC Challa Ramakrishna Reddy dies

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి బుధవారం నాడు కర్నూలు జిల్లా అవుకు చేరుకొని దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరోనాకు చికిత్స పొందుతూ ఇటీవలే చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఈ రోజు చల్లా రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి, విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ పర్యటనలో సీఎం వైఎస్ జగన్ తో పాటుగా కర్నూల్ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ