పీఎం కేర్స్‌ కింద తెలంగాణ, ఏపీకి ఐదు చొప్పున ఆక్సిజన్‌ ప్లాంట్లు మంజూరు

5 Oxygen Generation Plants under PM Cares, Andhra Pradesh, Mango News Telugu, Nitrogen & Oxygen Plants, Oxygen Gas Plant and Generator, Oxygen Generation Plants, PM Cares, PM Citizen Assistance and Relief in Emergency Situations Fund, telangana, Telangana and AP Each Got 5 Oxygen Generation Plants, Telangana Corona News, Telangana gets 5 oxygen plants under PM CARE

ప్రధానమంత్రి సిటిజ‌న్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమ‌ర్జెన్సీ సిట్యుయేషన్స్ (పీఎం కేర్స్‌) ఫండ్స్ ట్రస్ట్ నుంచి దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 162 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.201.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల సెంట్రల్‌ మెడికల్‌ సప్లై స్టోర్ (సిఎమ్ఎస్ఎస్‌) వీటిని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనుంది. ఈ 162 ప్లాంట్ల ద్వారా మొత్తం 154.19 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో కూడిన ఆక్సిజన్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంటులు ఏర్పాటు చేసే ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌ను, సంబంధిత రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ను సంప్ర‌దించి నిర్ణయిస్తామని చెప్పారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఐదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్స్‌ ను కేటాయించారు. ఉత్తరప్రదేశ్ కు అత్యధికంగా 14, మహారాష్ట్రకు 10 కేటాయించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =