హైదరాబాద్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జనవరి 11, శనివారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. జనవరి 12, 13 తేదీల్లో సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ లోనే ఉండనున్నారు. జనవరి 13, సోమవారం నాడు తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్ రావుతో సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్ తో సమావేశం పూర్తైన తర్వాత 13వ తేదీ రాత్రికి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అలాగే జనవరి 14వ తేదీన సీఎం గుడివాడలో పర్యటించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నానున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో తాజా పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్, సీఎం వైఎస్ జగన్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇంతకుముందే మూడు సార్లు కీలక సమావేశాలు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం ఇంతకుముందే చర్చించిన ఇరువురు వచ్చే సమావేశంలో చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. అలాగే నదుల అనుసంధానం, గోదావరి జలాల తరలింపు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, తదితర అంశాలుతో పాటుగా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా వారు చర్చించే అవకాశం ఉంది.

[subscribe]