నేడు తిరుపతిలో పర్యటించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

AP CM YS Jagan, Ap Cm Ys Jagan Latest News, AP CM YS Jagan will Tour in Tirupati, AP CM YS Jagan will Tour in Tirupati Today, Darshans in Tirumala Tirupati Temple, Jagan Mohan Reddy to visit Tirupati, Mango News, Tirumala Tirupati, YS Jagan will Tour in Tirupati, YS Jagan will Tour in Tirupati Today

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి ఈ రోజు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సాయిధ దళాలు విజయం సొంతం చేసుకుని 50 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంగా విజయ జ్వాల కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు.

ముందుగా సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌ ఇంటికి వెళ్లి ఆయనను సీఎం సత్కరించనున్నారు. అనంతరం తిరుపతి పెరేడ్‌ గ్రౌండ్‌లో విజయ జ్వాల కార్యక్రమంలో పాల్గొంటారు. సైనికులకు అవార్డులు అందజేసి, ప్రసంగించనున్నారు. ఆతరువాత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లికి తిరుగుప్రయాణం కానున్నారు. తిరుపతిలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ