జగన్ సర్కార్ అన్ని సంక్షేమ పథకాల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తోంది, వారు లేకుండా వైసీపీ లేదు – సజ్జల రామకృష్ణారెడ్డి

YSRCP General Secretary Sajjala Ramakrishna Reddy Says Jagan Govt Implements Several Welfare Schemes For The Minorities,YSRCP General Secretary,Sajjala Ramakrishna Reddy,MLA Kotamreddy,Mango News,Mango News Telugu,Having endured many insults in party,with admiration for CM Jagan Nellore MLA Kotam Reddy's,Kotam Reddy sensational comments,mango news,mango news telugu,Ap It Minister Gudivada Amarnath,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

జగన్ సర్కార్ అన్ని సంక్షేమ పథకాల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తోందని, అలాగే వారికోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మైనార్టీల సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మైనార్టీలకు న్యాయం చేసింది ఆయన తనయుడు, ప్రస్తుత సీఎం జగన్ అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయని, అన్ని వర్గాల ప్రజలకు వాటి ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమవుతోందని సజ్జల తెలిపారు. సీఎం జగన్ అన్ని సంక్షేమ పథకాల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులు విద్యనభ్యసించే పాఠశాలలను అభివృద్ధి చేశారని వివరించారు. ఇక వైసీపీ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని, మైనార్టీలు లేకుండా వైసీపీ పార్టీయే లేదని, పార్టీకి వారు బలమని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + eleven =